Janasena Party: తిరుపతి ఉపపోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

|

Jan 22, 2021 | 8:21 AM

Janasena Party: తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Janasena Party: తిరుపతి ఉపపోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
Follow us on

Janasena Party: తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని పీఏసీ సభ్యులు కోరగా.. పవన్ తనదైన శైలిలో స్పందించారు. తిరుపతి ఉపపోరులో ఎవరు పోటీ చేయాలన్న దానిపై అవగాహనకు వచ్చామన్న పవన్.. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించిన తరువాత తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. మరో రెండు సమావేశాల్లో దీనిపై అంతిమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ జనసేన పోటీ చేస్తే తిరుపతి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తానని పవన్ ప్రకటించారు. ఇక, మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లయితే వారికే మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నది మరో వారం రోజుల్లో తేలుతుందన్నారు.

ఇదే సమయంలో దేవాలయాలపై దాడుల అంశంపై పవన్ తనదైన శైలిలో స్పందించారు. దేవాలయాలపై దాడుల విషయంపై వైసీపీలో కొందరు నేతలు వెటకారంగా మాట్లాడారని అన్నారు. రామతీర్థం ఘటన ఒక సున్నితమైన అంశం అని, దానిపై రాజకీయ లబ్ది పొందాలని తాము భావించలేదని చెప్పారు. ఆ కారణంగానే ఈ ఘటనపై తాము ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదని పవన్ స్పష్టం చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వారి విషయంలో అధికార పార్టీ సరిగ్గా స్పించలేదని పవన్ ఈ సందర్భంగా విమర్శించారు. తప్పు జరిగింది, దోషులను పట్టుకుంటామని ప్రభుత్వం చెప్పకపోవడం దారుణం అన్నారు. మతం చాలా బలమైందని, సున్నితమైందని ఆయన వ్యాఖ్యానించారు.’

Also read:

CM KCR: సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌.. 10 లక్షల ఎకరాలకు సాగు నీరందించే..

అతడి వల్లే మేము ఈ రోజు ఇలా ఆడగలుగుతున్నాం.. మాజీ క్రికెటర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన..