Pawan Kalyan-Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాక్సీ్న్ ప్రక్రియ చేపట్టిన అనతి కాలంలోనే దేశ వ్యాప్తంగా 100 కోట్ల డోసుల వ్యాక్సీన్లు కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 100 కోట్ల డోసుల వాక్సినేషన్ గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోదీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలురాయి అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విజయం సాధించడం నిజంగా గర్వకారణం అని తెలిపారు. గడచిన ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే కాకుండా భారత దేశాన్ని కూడా ఓ కుదుపు కుదిపేసిందని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
ఒక దశలో డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి వైద్య నిపుణులు ప్రతి ఒక్కరూ భారత దేశంలో కోట్లాది మంది చనిపోతారనీ, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని రకరకాల ఊహాగానాలు చేశారని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ఉహాగానాలన్నింటినీ దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్క్ దాటిందని, ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. అలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖలోని హెల్త్ వర్కర్స్, వైద్యులు, వైరాలజిస్టులు, ప్రతి ఒక్కరికీ పవన్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. వారి కృషి కారణంగానే ఇంతటి ఘనత సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.
Also read:
Car in Flood Video: వరదలో కొట్టుకుపోతున్న కారును తాడుతో పక్కకు లాగిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో..
Ravana Funny Dance Video: రామ్‌లీలాలో రావణుడి ఫన్నీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..