పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో మంత్రుల వాహనాలపై దాడి ఘటన కేసులో 71 మందిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు పోలీసులు. వారిలో 9 మంది జనసేన నాయకులకు రిమాండ్ విధించింది కోర్టు. ఈనెల 28 వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. మరో 62 మంది జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. రూ.10వేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మిగిలిన 9 మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్‌గా మార్చి రిమాండ్ విధించింది.
సొంత పూచి కత్తుపై బెయిల్ మంజూరు చేశారు. రిమాండ్ విధించిన కోన తాతరావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీను లను కోర్టు నుంచి భారీ భద్రత మధ్య సెంట్రల్ జైల్ కు తరలించారు.
అంతకుముందు.. అరెస్టు చేసిన జనసేన నాయకులను భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. మూడు వాహనాల్లో కోర్టుకు అరెస్టు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు.. దాదాపు 8 వాహనాల్లో పోలీసులు కూడా కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణతోపాటు బయట కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజువల్స్..
-పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా.. ఎయిర్ పోర్టులో మంత్రుల వాహనాలపై దాడి వ్యవహారంలో మున్నంగి దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై ఐపీసీ సెక్షన్ 147, 148, 149, 341, 307, 324, 325, 427, 188 ఐపీసీ రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన సంగతే తెలిసిందే.
Reporter: Khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..