CM Jagan: ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి పర్యటన నేడే.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారభించేందుకు ముఖ్యమంత్రి..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారభించేందుకు ముఖ్యమంత్రి ఆళ్లగడ్డకు రానున్నారు. గన్నవరం నుంచి ఓర్వకల్లుకు ప్రత్యేక విమానంలో వచ్చి, అక్కడి నుంచి ఆళ్లగడ్డకు హెలికాప్టర్లో చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నంద్యాల కలెక్టర్ జిలానీ, ఎస్పీ రఘువీరారెడ్డి బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
సోమవారం ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు ఆళ్లగడ్డలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 కు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. రైతులకు ఆర్ధిక సహాయం అందించడం, వారికి అండగా నిలబడడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారభించింది.
రైతుల అభ్యున్నతి కోసం 2019 లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కోట్లాదిమంది అన్నదాతలు లబ్ది పొందుతున్నారు. ఏటా మొదటి విడత ఏప్రిల్ నుంచి జులై మధ్యలో, రెండో విడత ఆగష్టు, నవంబర్ మధ్యలో విడుదల చేస్తుంటారు. మూడో విడతగా డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో అన్నదాత ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..