
విజయవాడ, జూన్ 19: బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని, ఆయనకు వెంటనే Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల నుంచి పవన్‌కు బెదిరింపులు వస్తున్నాయన్నారు. అందుకే కేంద్రం వెంటనే స్పందించిన పవన్‌కు ఎస్కార్ట్‌తో పాటు Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ఎవరైనా వైసీపీకి అడ్డం వస్తే ఏమయినా చేస్తారని.. అందుకే పవన్ ఎదిగితే తట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. పవన్ భద్రత విషయంలో బీజేపీ కేంద్ర పార్టీ జోక్యం చేసుకోవాలన్నారు. పవన్‌కు రక్షణ కల్పించాలి.. పవన్ కు ప్రమాదం ఉందన్నారు. అమిత్ షా, నడ్డాలు ఏపిలో పాలన ఎలా ఉందనే దానిపై సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఏపీలో ఇళ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుందన్నారు.
లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారని అన్నారు. ఏపిలో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందన్నారు. సాప్ట్ వేర్‌లో నడ్డా చెపితే, అమిత్ షా హార్డ్ వేర్‌లో చెప్పారని అన్నారు. అమిత్ షా మాట్లాడిన తీరుకు వైసీపీ భయపడిందన్నారు. సీఎం జగన్ ఆలోచన విధ్వంసరచన చేస్తోందన్నారు. సొంత చిన్నాయనను చంపించారు.. వివేకా హత్య కేసును అంతులేని కథగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
జూలై 3 న అంతు లేని కథను సుప్రీం కోర్టులో అంతం కానుందన్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది వైయస్ వాళ్ళు వస్తారు అనేది బయటకు రానుందో చూడాలన్నారు . వివేకా కేసులో సిబిఐ గడువు పెంచుతారని.. జగన్ నిత్య అసంతృప్తవాదని విమర్శించరాాాాాాాాాాా.. ఎంపీ కిడ్నాప్.. నాటకమే అని అన్నారు. ఈ రాష్ట్రానికి వీళ్ళు అవసరమా.. వివేకా హత్య కేసులో జగన్ నైతిక బాధ్యత వహించాలని