Janavani Jana Sena Bharosa- ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) నిర్వహిస్తోన్న జనవాణి జనసేన భరోసా (Janavani Janasena Bharosa) కార్యక్రమం ఒక వారం పాటు వాయిదా పడింది. పవన్ అనారోగ్యం బారిన పడడమే దీనికి కారణం. ఇటీవల జనవాణి కార్యక్రమంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన పవన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. అందువల్ల తదుపరి జనవాణి జులై 24న కాకుండా 31వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనవాణి నిర్వహించే స్థలం, వేదిక తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కష్టాలను తెలుసుకొనేందుకు ప్రతి ఆదివారం జనవాణి- జనసేన భరోసా పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విజయవాడ, భీమవరంలలో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మరో రెండు విడతల ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. అయితే ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ ప్రోగ్రాం వాయిదా పడింది.
ఈ నెల 31న తదుపరి జనవాణి – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/k9mWoMNt3Q
— JanaSena Party (@JanaSenaParty) July 20, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..