
మిత్రపక్షమైన బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయన్నారు. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా.. పూర్తి స్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామని అన్నారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుసన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వం అంటే తనకు గౌరవం ఉంది.. అలాగని ఊడిగం చేయలేమన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఏ ప్రభుత్యం ఉన్నా కేంద్రలోని బీజేపీతో కలిసి పని చెయ్యాలన్నారు. బీజేపీతో మేము కలిసే ఉన్నాం.. అయినా ఇప్పటి వరకు వారు వైసీపీకి సపోర్ట్ చేశారు.. ఇప్పుడు మా పార్టీకి సపోర్ట్ చెయాలని అన్నారు.
వైసీపీ నేతల్లారా.. యుద్ధానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు పవన్. దేనితో వస్తారో మీరే తేల్చుకోంటూ అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జనసేనాని పవన్. ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించే వారిని చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఉద్యమం తనకు తెలంగాణ నుంచి స్పూర్తి అన్నారు పవన్. తన సహనమే ఇంత కాలం మిమ్మల్ని రక్షించిందంటూ పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భాష రాదనుకున్నారా.. తిట్టడం రాదకున్నారా అంటూ ధ్వజమెత్తారు పవన్ కల్యాన్. లండన్‌లో పుట్టలేదు, విదేశాల్లో పెరగలేదు. బాపట్లలో పుట్టిన వాడిని గొడ్డు కారం తిన్నోడిని.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పెళ్లిళ్లపై విమర్శించే వాళ్లు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు పవన్. ఒక్కరిని పెళ్లి చేసుకోని.. 30 స్టెపినీలతో తిరిగే వారికి నేను సమాధానం చెప్పాలా అంటూ ప్రశ్నించారు జనసేనాని. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటానికి తాము ఐపిఎస్ ఆఫీసర్లు కొడుకులం కాదంటూ మండిపడ్డారు పవన్. వైసీపీ నేతలకు శిక్షాధర్మం తప్పదంటూ హెచ్చరించారు.
ఇందిలావుంటే.. తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరమన్న పవన్… అక్కడ ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో… రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో క్యాడర్‌ను దిశానిర్దేశం చేశారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం