తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా వారి సహేతుకమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2010లో టీటీడీ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని..ఆ విధంగానే సొసైటీలు ఏర్పాటయ్యాయని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత హితవు పలికారు.
నిధుల మళ్లింపునకే కొత్త కార్పొరేషన్..
‘వైసీపీ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు్న్నాయి. ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు విలీనం లాగే ఇప్పుడు టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డుమీదుకు లాగుతోంది. ఇందులో భాగంగానే 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ గా మార్చాలనుకుంటోంది. ఇది ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్య. ఒకే పని చేస్తున్న రెగ్యులర్ కార్మికులకు, ఒప్పంద కార్మికులకు కానీ ఒకే వేతనం చెల్లించాలన్న జస్టిస్ సుప్రీంకోర్డు 2016 లో వెలువరించిన తీర్పును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కార్పొరేషన్లో చేరని వారిని ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. నిధులు దారి మళ్లించేందుకే ప్రభుత్వం కొత్తగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తోంది. టీటీడీ కార్మికులకు అండగా ఉంటామన్న జగన్మోహన్ రెడ్డి వారికి పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చారు? 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది’ అని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Also Read:
KRMB-AP-TS: సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను అప్పగించండి.. ఏపీ, తెలంగాణ సీఎలకు కేఆర్ఎంబీ చైర్మన్ లేఖ
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఆ జిల్లాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..
Andhra Pradesh: సగం ధరకే కొత్త బ్రాండెడ్ సెల్‌ఫోన్లు.. ఎగబడ్డ జనం.. ఆరా తీస్తే షాక్