Rajahmundry: బుచ్చయ్య చౌదరిని పక్కనపెట్టి, జనసేనకు టికెట్ ఇస్తుందా ? వైసీపీ నుంచి బరిలో ఎవరు..?
తెలుగు దేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సంక్రాంతి తరువాత సీట్లపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే రాజమండ్రి రూరల్ సీటు తనకే దక్కుతుందని జనసేన ముఖ్యనేతల్లో ఒకరైన కందుల దుర్గేశ్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వొచ్చారు.

తెలుగు దేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సంక్రాంతి తరువాత సీట్లపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే రాజమండ్రి రూరల్ సీటు తనకే దక్కుతుందని జనసేన ముఖ్యనేతల్లో ఒకరైన కందుల దుర్గేశ్ ధీమాగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వొచ్చని, అయితే పొత్తు కుదిరిన తరువాత పొత్తు ధర్మం పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రాజమండ్రి రూరల్ స్థానంలో తాను చాలాకాలం నుంచి పని చేస్తున్నానని కందుల దుర్గేశ్ అంటున్నారు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కళ్యాన్‌లదే తుది నిర్ణయమని.. అయినప్పటికీ రాజమండ్రి రూరల్ సీటు తనకు వస్తుందని ఆశిస్తున్నానని దుర్గేశ్ తెలిపారు.
రాజమండ్రి రూరల్ సీటు నుంచి ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్నారు. అలాంటి బుచ్చయ్య చౌదరిని పక్కనపెట్టి, ఈ సీటును టీడీపీ నాయకత్వం జనసేనకు ఇస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజమండ్రి రూరల్ సీటుపై ఈసారి వైసీపీ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా వీచినప్పటికీ.. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ విజయం సాధించింది. దీంతో ఈసారి రాజమండ్రి రూరల్ సీటును సొంతం చేసుకోవడానికి వైసీపీ పలు మార్పులు చేసింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ను రాజమండ్రి రూరల్‌ను బరిలోకి దింపబోతోన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి రాజమండ్రి రూరల్ సీటు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం.. జనసేన ముఖ్యనేత కందుల దుర్గేశ్ ఆ సీటుపై గట్టిగా ఫోకస్ చేయడం తూర్పుగోదావరి జిల్లా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…