jagannanna swacha sankalpam: గంగవరంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం.. రిక్షావాలా గా మారిన మంత్రి

|

Aug 02, 2022 | 8:21 AM

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 41 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు.

jagannanna swacha sankalpam: గంగవరంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం.. రిక్షావాలా గా మారిన మంత్రి
Ap Minister
Follow us on

Minister Chelluboina Srinivasa Venu Gopala Krishna: కోనసీమ జిల్లాలో రిక్షా వాలాగామారారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 41 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు. గంగవరం గ్రామంలో 41 ట్రై రిక్షాలు, బ్లూ, గ్రీన్ డస్ట్ బిన్నులు పంపిణీ చేశారు. గ్రామ పంచాయితీలలో చెత్త ను తరలించే పారిశుద్ధ్య కార్మికుల తొట్టె రిక్షా ఎక్కి పారిశుద్ధ్య కార్మికులతో మమేకమై వారిలో జోష్ నింపారు మంత్రి వేణు గోపాల కృష్ణ.

స్వచ్ఛ సంకల్పం అనే నినాదంతో ప్రజలందరూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి వర్మి కంపోస్టుగా తయారుచేసి ఉపయోగించాలని సూచించారు.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లను వేరుచేసి నిర్దేశించిన ప్రదేశాలలో డంపు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి