Jagananna Vasathi Deevena: రేపు జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం: పదిలక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ!

|

Apr 27, 2021 | 10:46 PM

పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకునే దిశలో మరో పథకం ప్రారంభిస్తున్నారు. జగనన్న వసతి దీవెన పథకం బుధవారం ప్రారంభించనున్నారు.

Jagananna Vasathi Deevena: రేపు జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం: పదిలక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ!
Cm Jagan
Follow us on

Jagananna Vasathi Deevena: పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకునే దిశలో మరో పథకం ప్రారంభిస్తున్నారు. జగనన్న వసతి దీవెన పేరుతో విద్యార్ధుల వసతి, భోజన, రవాణా ఖర్చులకు గాను బుధవారం  ఈ పథకం కింద విద్యార్ధుల తల్లుల ఖాతాలో 1,048.94 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకంలో ఇది మొదటి విడత. రెండో విడతగా మిగిలిన సొమ్ము డిసెంబర్ లో చెల్లిస్తారు. ఐటీఐ విద్యార్ధులకు పదివేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు పదిహేను వేలు.. డిగ్రీ ఆపై చదువుల వారికీ 20 వేల రూపాయల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటె అంతమందికీ వారి తల్లుల ఖాతాకు ఈ సొమ్ము జమ చేస్తోంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం లేదని ప్రభుత్వం చెబుతోంది.

జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇప్పటికే రూ. 1,220.99 కోట్లు చెల్లించడం జరిగింది. ఇప్పుడు మొదటివిడతగా రూ. 1,048.94 కోట్లు ఈ రోజు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. దీంతో ఇప్పటివరకు వసతిదీవెన కింద రూ. 2,269.93 కోట్లు చెల్లించినట్లు అవుతుంది.

ఇప్పటివరకూ విద్యారంగంపై వివిధ పథకాల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన సాయం…మొత్తం లబ్దిదారులు – 1,60,75,373 మందికి గాను జరిగిన లబ్ది రూ. 25,714.13 కోట్లు. దీంతోపాటు నాడు నేడు పథకం కింద ప్రీప్రైమరీ స్కూళ్ళుగా మారబోతున్న అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ. 1,800 కోట్లు వ్యయం కూడా చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

Also Read: Ananthapuramu District: అనంతపురం జిల్లాలో అమానుషం.. దళిత మహిళపై దాడికి పాల్పడ్డ ఓ వర్గం..

Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి గుంటూరు సంగం డెయిరీ… కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ రాష్ట్ర సర్కార్