Jagananna Thodu: వారి ఖాతాల్లోకి జగనన్న తోడు డబ్బులు జమ.. డేట్ ఫిక్స్..

బ్రవరి 22న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు..

Jagananna Thodu: వారి ఖాతాల్లోకి జగనన్న తోడు డబ్బులు జమ.. డేట్ ఫిక్స్..

Updated on: Feb 16, 2022 | 1:59 PM

రాష్ట్రంలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జ‌గ‌న‌న్నతోడు ప‌థ‌కాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 6,91,530 మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందారు. మూడో దశలో మరో 1,57,760 మందికి రుణాలు పొందుతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితానుంచి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జ‌గ‌న‌న్న తోడు పథకం క్రింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారికి ఏటా 10 వేల రుపాయిలు వ‌ర‌కు వ‌డ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

ప‌ది వేల రుపాయిల‌కు ఏడాదికి అయ్యే వ‌డ్డీని ప్రభుత్వం నేరుగా ల‌బ్దిదారుల‌కు అందింస్తుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అంద‌జేస్తుంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని ల‌బ్దిదారులు తిరిగి చెల్లించిన తర్వాత మ‌ర‌లా వారు బ్యాంకుల నుండి మళ్ళీ వడ్డీ లేని రుణం తీసుకోవ‌చ్చని ఏపీ సర్కార్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?