Chandrayaan-3: సంచలనంగా మారిన ఫ్లైట్ నుంచి మొబైల్‌తో చంద్రయాన్-3 లాంచ్ వీడియో.. ఇస్రో అధికారుల హెచ్చరిక ఇదే..

| Edited By: Ravi Kiran

Jul 16, 2023 | 11:19 AM

చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది.. LVM-3-M4 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.. ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా మీడియా ద్వారా తిలకిస్తే.. కొందరు నేరుగా శ్రీహరికోట లోని ఇస్రో గ్యాలరీ నుంచి వీక్షించారు..

Chandrayaan-3: సంచలనంగా మారిన ఫ్లైట్ నుంచి మొబైల్‌తో చంద్రయాన్-3 లాంచ్ వీడియో.. ఇస్రో అధికారుల హెచ్చరిక ఇదే..
Chandrayaan 3
Follow us on

చంద్రాయన్ 3 ప్రయోగానికి సంబంధించిన కొన్ని వీడియోలు , ఫోటోలు ఇపుడు వైరల్ గా మారాయి.. అదే క్రమంలో వీటిపై తీవ్రంగా చర్చ కూడా జరుగుతోంది.. ఈ నెల 24న శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది.. LVM-3-M4 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.. ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా మీడియా ద్వారా తిలకిస్తే.. కొందరు నేరుగా శ్రీహరికోట లోని ఇస్రో గ్యాలరీ నుంచి వీక్షించారు.. ఇక ఆ సమయంలో అటుగా వెళుతున్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.. అదే స్థాయిలో వీడియోపై తీవ్రంగా చర్చ కూడా జరుగుతోంది.. అదేంటంటే రాకెట్ లాంచ్ జరిగిన కొన్ని నిమిషాల పాటు ఆకాశం నుంచి రాకెట్ శకలాలు కింద పడుతుంటాయి.. అవి భారీ సైజులో టన్నుల బరువు కలిగి ఉంటాయి..

అలా ప్రయోగం జరిగే సమయంలో విమానాలను అనుమతిస్తారా.. అలాంటి సందర్భాల్లో విమానాలకు ప్రమాదం కదా అంటూ డిస్కషన్ జరుగుతోంది.. అలాగే మరి కొందరు షిప్ ల్లో నుంచి కూడా చంద్రయాన్ 3 ప్రయోగం వీడియో, ఫోటోలు తీశారు.. అవి కూడా వైరల్ గా మారాయి..

ఇదే విషయమై టీవీ9 ఇస్రో అధికారులను అడగగా.. రాకెట్ ప్రయోగానికి రెండు వారాల ముందుగానే విమానయాన శాఖ, నావి అధికారులకు అలెర్ట్ ఇస్తామని.. ఆయా అధికారులు ఎయిర్ లైన్ సర్వీసులకు, షిప్పింగ్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పారు.. అయితే లాంచ్ ఏరియా లిమిట్స్ వరకు నిషేధం ఉంటుందని.. ఆ పై రాకపోకలకు అభ్యంతరం లేదని చెప్పారు..

చెన్నై నుంచి డాకా వెళుతున్న ఫ్లైట్ నుంచి తీసిన ఈ వీడియో పై నెటిజన్ల కామెంట్స్ ఫైలెట్ జర జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు..


మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం