కోనసీమలో మూకుడు రొట్టెకు పెరిగిన డిమాండ్‌

Gas shortage : గ్యాస్ కొరత వల్ల చాలా మంది కట్టెలను అడవుల నుంచి తెచ్చి ఆహారాలను తయారు చేసుకుంటున్నారు. పాత రోజుల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేసే వాళ్ళు. మళ్ళీ, ఇన్నాళ్ళకు పుల్లల తెచ్చి పొయ్యి మీద అన్నం, కూర వండుతున్నారు.

కోనసీమలో మూకుడు రొట్టెకు పెరిగిన డిమాండ్‌
Lifestyle

Edited By:

Updated on: Mar 18, 2026 | 4:49 PM

మారుతున్న కాలంతో పాటు వంటింట్లోకి గ్యాస్ స్టౌవ్‌లు వచ్చాయి కానీ, కట్టెల పొయ్యిపై చేసే వంటల రుచే వేరు. అందుకే కోనసీమ వాసులకి ‘పాత రుచుల’పై మక్కువ తగ్గలేదు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో.. జిల్లాలోని అనేక ఆధునిక హోటళ్లు మూతపడుతున్నాయి. ఇదే సమయంలో కట్టెల పొయ్యిపై వంటలు చేసే పురాతన హోటళ్లకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామంలోని ఒక పాతకాలపు హోటల్ ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ దశాబ్దాలుగా గ్యాస్‌తో పనిలేకుండా కేవలం కట్టెల పొయ్యిపైనే టిఫిన్లు తయారు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడి ‘మూకుడు రొట్టె’ రుచి చూడటానికి జనం కిలోమీటర్ల దూరం నుండి తరలివస్తున్నారు. ఏసీ గదుల్లో టిఫిన్ చేసే వారు సైతం ఇప్పుడు ఈ ‘కాకా హోటల్’ ముందు క్యూ కట్టడం విశేషం.

గ్యాస్ కొరత వల్ల పట్టణాల్లో హోటళ్లు మూతపడటంతో, జనం సంప్రదాయ వంటల వైపు మొగ్గు చూపుతున్నారు. “కట్టెల పొయ్యిపై వండిన ఆహారం కేవలం రుచికరంగానే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది” అని భోజన ప్రియులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోవడం, సహజసిద్ధమైన పద్ధతిలో చేసే వంటకాలు దొరుకుతుండటంతో ఈ పాతకాలపు హోటళ్లకు గిరాకీ అమాంతం పెరిగింది. పరిస్థితులు సంక్షోభంలో ఉన్నప్పుడు మనిషి మళ్లీ మూలాల్లోకి వెళ్తాడనే దానికి కోనసీమలోని ఈ దృశ్యాలే నిదర్శనం. ఆధునికతను కాదని, సంప్రదాయానికి పట్టం కడుతున్న కోనసీమ వాసులు.. నిజంగానే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని నిరూపిస్తున్నారు.

Follow Us