Kanigiri Hospital: డయాలసిస్ సెంటర్‌లో షార్ట్ సర్క్యూట్.. మూడు రోజులుగా నిలిచిన వైద్యసేవలు.. రోగులకు తీవ్ర ఇబ్బంది

|

May 01, 2023 | 6:50 AM

కనిగిరి డయాలసిస్ సెంటర్లో రోగులు అవస్థలుపడుతున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగా మూడు రోజులుగా వైద్య సేవలు నిలిచిపోయాయి. 17పడకలు కలిగిన కనిగిరి డయాలసిస్ సెంటర్‌లో రోజు 50మంది కిడ్ని రోగులు వైద్యం చేయించుకుంటారు. 

Kanigiri Hospital: డయాలసిస్ సెంటర్‌లో షార్ట్ సర్క్యూట్.. మూడు రోజులుగా నిలిచిన వైద్యసేవలు.. రోగులకు తీవ్ర ఇబ్బంది
Kanigiri Dialysis Center
Follow us on

ప్రకాశం జిల్లా కనిగిరిలోని డయాలసిస్ సెంటర్‌లో రోగుల అవస్థలు అన్నీఇన్నీకావు. గత మూడు రోజులుగా వైద్యసేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ సెంటర్ లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో కిడ్నీ బాధితులకు మూడు రోజులుగా వైద్యం అందని దుస్థితినెలకొంది. రోజువారి పేషెంట్లు ఆస్పత్రికి క్యూ కడుతుండడంతో చేసేందేంలేక కొంతమంది డయాలిసిస్ పేషెంట్లను అటు కందుకూరు, ఇటు మార్కాపురం ఆస్పత్రులకు తరలిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.

ఆస్పత్రిలోని పవర్ సప్లైలో హై వోల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో డయాలసిస్ సెంటర్ లోని యూనిట్ పరికరాలు, డయాలసిస్ మిషిన్ లోని బోర్డులు, ఏసీలు పూర్తిగా కాలిపోయాయి. మూడు రోజులుగా వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే 17పడకలు కలిగిన కనిగిరి డయాలసిస్ సెంటర్‌లో రోజు 50మంది కిడ్ని రోగులు వైద్యం చేయించుకుంటారు. కనిగిరి పరిసర ప్రాంతాల నుండే కాకుండా అటు నెల్లూరు జిల్లా నుంచి కూడా కిడ్నీ బాధితులు వైద్యం కోసం ఇక్కడకు వస్తారు. కనిగిరిలో ఫ్లోరైడ్ కారణంగా డయాలసిస్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో .. ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడు సంవత్సరాల క్రితం 17 పడకలతో కూడిన డయాలసిస్ సెంటర్ ను ఓపెన్ చేసింది. ఇప్పుడు ఆడయాలసిస్ సెంటర్లో మూడు రోజులుగా వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..