ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. రిజర్వేషన్ ఉన్నవారికే అనుమతి..

| Edited By: Pardhasaradhi Peri

Dec 09, 2020 | 5:58 PM

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణీకులకు, ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు శుభవార్త. విజయవాడ-లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్ సిటీ ఏసీ...

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. రిజర్వేషన్ ఉన్నవారికే అనుమతి..
Follow us on

Intercity AC Express: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణీకులకు, ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు శుభవార్త. విజయవాడ-లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్ సిటీ ఏసీ ఎక్స్‌ప్రెస్(ఎంప్లాయిస్ ట్రైన్) ఇవాళ్టి నుంచి దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయల్దేరనున్న ఈ రైలు(02795).. రాత్రి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది. అలాగే రేపట్నుంచి లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి మధ్య పరుగులు పెట్టనుంది.

ప్రతీరోజూ ఈ ట్రైన్ 02796 నెంబర్‌తో లింగంపల్లి నుంచి ఉదయం 4.40 గంటలకు బయల్దేరి.. ఉదయం 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరనున్న ఈ రైలు(02795) రాత్రి 11.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. మంగళగిరి, గుంటూరు, సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలోనే ఈ ట్రైన్ ఆగుతుంది.  ఏసీతో పాటు నాన్ ఏసీ చైర్ కార్ సౌలభ్యం కలిగిన ఈ రైలులో అన్ని సీట్లకు రిజర్వేషన్ కల్పించారు. కరోనా నేపథ్యంలో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లను మాత్రమే అనుమతించనున్నారు.

అలాగే ఈరోజు నుంచి మచిలీపట్నం – యశ్వంతపుర్ ప్రత్యేక రైలు నెంబర్ 07211 సోమ, బుధ, శుక్రవారాల్లో నడవనుంది. మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇదే రైలు 07212 నెంబర్‌తో యశ్వంత్ పూర్ నుంచి మంగళ, గురు, శని వారాల్లో బయలు దేరుతుంది. అంతేకాకుండా కాకినాడ పోర్టు స్టేషన్ నుంచి లోకమాన్య తిలక్ ప్రత్యేక రైలు 07221 నెంబర్‌తో డిసెంబర్ 9 నుంచి బుధ, శనివారాల్లో ఉదయం 9 గంటలకు బయలు దేరుతుంది. అటు నుంచి అంటే లోకమాన్య తిలక్ నుంచి 07222 నెంబర్ తో గురు, ఆదివారాల్లో బయలు దేరుతుంది.

ఇక మరో రైలు కాకినాడ భావనగర్ టెర్మినస్ ప్రత్యేక రైలు నెంబర్ 07204 డిసెంబర్ 10 నుంచి కాకినాడలో ఉదయం 5.15 నిమిషాలకు బయలు దేరుతుంది. ఇదే రైలు 07203 నెంబర్‌తో ప్రతి శనివారం ఉదయం 4.25 నిమిషాలకు భావనగర్ టెర్మినస్ నుంచి బయలుదేరుతుంది.

కాగా, హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రతీ రోజూ నడిచే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్(నెంబర్ 02721/02722) స్పెషల్ ట్రైన్ టైమింగ్‌లో జనవరి 1 నుంచి మార్పులు జరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. జనవరి 1 నుంచి  ఈ రైలు హైదరాబాద్‌లో రాత్రి 11 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు చేరుకోనుంది. అలాగే నిజాముద్దీన్ స్టేషన్ నుంచి రాత్రి 10.50 గంటలకు బయల్దేరి.. హైదరాబాద్ స్టేషన్‌కు మరుసటి రోజు మార్కింగ్ 3.40కి చేరుకోనుంది.