Post Office Jobs: పదో తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్.. నో ఇంటర్వ్యూ.. నిరుద్యోగులూ త్వరపడండి!

|

Feb 14, 2023 | 7:46 PM

తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్‌లోని జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి..

Post Office Jobs: పదో తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్.. నో ఇంటర్వ్యూ.. నిరుద్యోగులూ త్వరపడండి!
Post Office
Follow us on

మరో రెండు రోజులు మాత్రం.. త్వరపడండి.. తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్‌లోని జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 40,889 పోస్టులు ఉండగా.. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 1266, ఏపీ సర్కిల్‌లో 2480 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాదు ఆ అభ్యర్ధి సెకండరీ తరగతి వరకు స్థానిక భాషను అభ్యసించాల్సి ఉండటంతో పాటు గణితం, ఆంగ్లం సబ్జెక్ట్స్ తప్పనిసరి.

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.. కేవలం పదో తరగతిలో వచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. ఇక ఎంపికైన అభ్యర్ధుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అప్ ‌లోడ్ చేస్తారు. అనంతరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, అలాగే జాయినింగ్ లెటర్ మీ ఇంటికి వస్తుంది. కాగా, ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులు వయస్సు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. అటు రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్ధులకు వయో సడలింపు ఉంటుంది. కాగా, దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 16 కాగా, అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ ఫిబ్రవరి 17-19 వరకు ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాల కోసం https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.