Independence Day: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఈ స్టూడెంట్స్ వెరీ వెరీ స్పెషల్.. తెలుగు భాషకు పట్టంకట్టిన విద్యార్థులు

| Edited By: Ravi Kiran

Aug 09, 2022 | 4:01 PM

తెనాలి (Tenali) నెహ్రూ నికేతన్ లో ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు భాషకు పట్టంకట్టారు విద్యార్థులు.. తాము అందరికంటే భిన్నం అని నిరూపించారు.

Independence Day: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఈ స్టూడెంట్స్ వెరీ వెరీ స్పెషల్.. తెలుగు భాషకు పట్టంకట్టిన విద్యార్థులు
Independence Day
Follow us on

Independence Day: దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు‌ (Azadi ka Amrit Mahotsav)  ఘనంగా జరుపుకుంటున్నారు.  అన్ని రంగాల వారు స్వాతంత్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు. తాజాగా తెనాలి (Tenali) నెహ్రూ నికేతన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు భాషకు పట్టంకట్టారు విద్యార్థులు.. తాము అందరికంటే భిన్నం అని నిరూపించారు.

భారత్ 75 ఆకారంలో విద్యార్థులు కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెనాలిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. భారత్ 75 ఆకారంలో కూర్చున్న విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్య్ర పోరాటం గురించి విద్యార్థులకు తెలియ జెప్పేందుకు ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు చేసిన ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంది.

Reporter: Nagaraju , TV9 :Telugu

ఇవి కూడా చదవండి