Accident: తిరుమల వెళ్ళి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. మృతులంతా హైదరాబాదీ వాసులు

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌ చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Accident: తిరుమల వెళ్ళి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. మృతులంతా హైదరాబాదీ వాసులు
Nandyal Road Accident

Updated on: Mar 06, 2024 | 9:31 AM

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌ చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కారులో ఉన్న వారందరినీ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తిరుమల దర్శనానికి వెళ్ళి వస్తున్నట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు రవీందర్, లక్ష్మితోపాటు వారి కొడుకు బాల కిరణ్ కోడలు కావ్య శ్రీ, అశోక్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఫిబ్రవరి 19న బాల కిరణ్‌తో కావ్య శ్రీ వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. 10 రోజుల్లోనే నవ దంపతుల మృతి పట్ల కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..