Kothapalli Geetha: సీబీఐ కోర్టు తీర్పుపై స్టే.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరు..

|

Sep 16, 2022 | 5:50 PM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Kothapalli Geetha: సీబీఐ కోర్టు తీర్పుపై స్టే.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరు..
Kothapalli Geetha
Follow us on

PNB loan fraud case: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం ఈ కేసుపై విచారించిన హైకోర్టు.. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 16కు వాయిదా వేసింది.

కాగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కేసులో కొత్తపల్లి గీతతోపాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు సీబీఐ కోర్టు ఇటీవల ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. మొత్తం రూ.42 కోట్ల మోసం జరిగినట్లు నిర్ధారించిన కోర్టు.. గీత దంపతులతో పాటు బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్‌, కేకే అరవిందాక్షన్‌కూ సైతం ఐదేళ్ల జైలు శిక్ష, విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.2లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది.

అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొత్తపల్లి గీత దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం గీత దంపతులకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..