Andhra Pradesh: అనంతపురం నగరంలో ఒక నవ వధువు ఆత్మహత్యాయత్నం తీవ్ర విషాదాన్ని నింపింది. నగర శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ కుమార్తె సాయి సుజన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి బాత్ రూమ్ కు వెళ్తున్నానని లోపల గడియ పెట్టుకొని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే సుజన మరణించి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే సుజకు పది రోజుల క్రితం వివాహమైంది. మేడాపురం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పెళ్లయినప్పటి నుంచి తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక మదనపడుతూ ఉండేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుజన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలేంటి అనే దానిపై కూపీ లాగుతున్నారు. ప్రేమ వ్యవహారమేమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..