AP Rains: వామ్మో.! తుఫాన్ టెన్షన్.. ఏపీలో ఈ జిల్లాలకు కుండబోత, ఫ్లాష్ ఫ్లడ్స్.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

దిత్వా దడ పుట్టిస్తోంది. తమిళనాడు, పుదుచ్ఛేరి తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తోంది. శ్రీలంక నుంచి నెల్లూరుదాకా దీని ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ తుఫాన్ ప్రభావం ఏపీలో ఎలా ఉండబోతోంది.. ఆ వివరాలు ఇలా ఉండనున్నాయి. ఓ సారి చెక్ చేసేయండి.

AP Rains: వామ్మో.! తుఫాన్ టెన్షన్.. ఏపీలో ఈ జిల్లాలకు కుండబోత, ఫ్లాష్ ఫ్లడ్స్.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
AP and Telangana Weather Updates

Updated on: Nov 30, 2025 | 1:54 PM

నిన్నటి దిత్వా తుఫాను గత 6 గంటల్లో గంటకు12 కి.మీ వేగంతో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతాల్లో దాదాపు ఉత్తరం వైపుకు కదిలి, ఈరోజు, నవంబర్ 30, 2025న ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంపై, 11.4° ఉత్తర అక్షాంశం, 80.6° తూర్పు రేఖాంశం దగ్గర, కడలూరు (భారతదేశం)కి తూర్పు-ఆగ్నేయంగా 100 కి.మీ., కరైకల్ (భారతదేశం)కి తూర్పు-ఈశాన్యంగా 100 కి.మీ., పుదుచ్చేరి (భారతదేశం)కి ఆగ్నేయంగా 110 కి.మీ., వేదరన్నియం (భారతదేశం)కి ఈశాన్యంగా 140 కి.మీ. చెన్నై (భారతదేశం)కి దక్షిణ-ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుండి తుఫాను యొక్క కేంద్రం దాదాపు కనీసం 70 కి.మీ దూరంలోఉన్నది .ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి ఈరోజు మధ్యాహ్నం నకు కనీసం 60 కి.మీ, సాయంత్రం నాటికి 30 కి.మీ దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
——————————————————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
———————————-

ఈరోజు :-
————

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టముగా 55 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-
—–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టంగా 55 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-
——–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
———————————–

ఈరోజు:-
———-

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50-60 కీ.మీ గరిష్టముగా 70 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

రేపు:-
—–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టముగా 55 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది

ఎల్లుండి:-
———–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:-
—————

ఈరోజు :-
———-

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50-60 కీ.మీ గరిష్టముగా 70 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

రేపు:-
—–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టముగా 55 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-
———–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.