AP Weather: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో

|

Aug 26, 2024 | 10:34 AM

ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదిగో వెదర్ రిపోర్ట్...

AP Weather: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో
Andhra Weather Report
Follow us on

ఏపీలో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ వానలు కంటిన్యూ అవుతాయని.. వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కోసాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల గాలులు, రుతుపవనాల ప్రభావంతో.. వర్షాలు పడనున్నట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం వరకు తీరప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటలకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కర్నూలు, బాపట్ల, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు.. అంతర్వేది నుంచి పెరుమల్లాపురం అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమగోదావరి తీరప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది. హార్బర్లు, మెరైన్ కార్యకలాపాల్లో అలెర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా వర్షాల సమయంలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఆ సమయంలో రైతు, రైతు కూలీలు.. పశువుల కాపర్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..