Anil Kumar Yadav: బతికినా, చచ్చినా సింహంలానే.. పోటీపై మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..

|

Jan 25, 2023 | 8:01 AM

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు టిక్కెట్ రాదనుకునే వాళ్లు శునకానందం పొందండి. 2024లో..

Anil Kumar Yadav: బతికినా, చచ్చినా సింహంలానే.. పోటీపై మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumar Yadav
Follow us on

Anil Kumar Yadav: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు టిక్కెట్ రాదనుకునే వాళ్లు శునకానందం పొందండి. 2024లో నేను పోటీ చేసిన తర్వాత మీరు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది, నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తా.. అంటూ అనిల్ కుమార్ ప్రకటించారు. మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎవరికి భయపడి ఎక్కడకు వెళ్లను’’.. తాను సీఎం జగన్‌ ముందు తప్ప ఏ ఒక్కరి ముందు తలవంచను అంటూ అనిల్ పేర్కొన్నారు. బతికినా, చచ్చినా సింహం లాగానే ఉంటాను, తల వంచకుండా బ్రతికితేనే మనకు క్యారెక్టర్ ఉంటుందని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.

ఎంత మంది తనకు వ్యతిరేకంగా పనిచేసినా నేను దిగజారి బతకను అన్న అనిల్‌.. తన్ను ఇబ్బంది పెడుతున్నారని వెళ్లి ఎవరి కాళ్లు మొక్కను అని అని తెలిపారు. తనకు ఆ అవసరం కూడా లేదన్నారు. తప్పు చేయాల్సిన అవసరం లేదు.. ఎవరిని లాగి కింద పడేయాల్సిన పని లేదని అనిల్ అన్నారు. తనపై సొంత పార్టీ నేతలే ఫోన్లు చేసి.. విమర్శలు చేస్తూ చిల్లర దండుకుంటున్నారని గత ఆగస్ట్‌లో ఆరోపించారు అనిల్.

కొంతమంది, ప్యాకేజీ మాట్లాడుకొని విమర్శలు చేస్తున్నారు, ఉదయం మీడియా ఎదుట ఆరోపణలు చేయడం.. సాయంత్రం డబ్బులు తీసుకోవడమే వారి పని అంటూ మండిపడ్డారు. మా పార్టీ నేతలతో మాట్లాడుతూ నాపై విమర్శలుచేస్తున్నవారి కాల్ లిస్ట్ చాలానే ఉంది, అవన్నీ బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయంటూ ఆగస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపాయి.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం సంచనలంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..