
వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శల దాడికి దిగుతున్నాడు. గురువారం పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. దుర్గాడ గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఆది సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించాడు. ఇంట్లోనే మంచి చేయనివాడు జనాలకు ఏం చేస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చెల్లెలు షర్మిల, సునీత గుర్తించి రోడ్ షోలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, కల్తీ మద్యం పోవాలంటే కూటమిని గెలిపించాలని ఓటర్లు కోరాడు.
నేను పిఠాపురంలో పుట్టనందుకు బాధగా ఉంది
పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తాను ఎందుకు పుట్టలేదని బాధగా ఉందని ఆది అన్నారు. ఒక వేళ పుఠాపురంలో పుట్టి ఉంటే బాగుండేదని, ఎందుకంటే పవన్ కల్యాణ్‌కు ఓటు వేసే అదృష్టం దక్కి ఉండేదని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సారి కూటమికి ఓటు వేసి అధికారంలోకి వచ్చేలా చూడాలన్నారు. కూటమి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి అవుతుందని, పేద ప్రజల కష్టాలు తీరుతాయని ఆది పేర్కొన్నారు. మీ ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేయాలని కోరారు.
ఆదిలా ఉండగా పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఎవరి వారు తమ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. ఇటుక కూటమి నేతలు, అటు వైసీపీ నేతల మధ్య హోరాహోరీగా ప్రచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైనా తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, తాము చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇటు కూటమి పార్టీ నేతలు ఈ సారి తమదే అధికారమని, వైసీపీ పాలనతో జనాలు విసిగిపోయారని, కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉన్నందున రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి