Special Trains: కాచిగూడ – కాకినాడ మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. మరికొన్ని కూడా పొడిగింపు.. ఇవిగో డీటేల్స్

ఎండాకాలంలో కాలేజ్, స్కూల్ స్టూడెంట్స్‌కు సెలవులు ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీలు ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు చాలామంది బంధువుల ఇళ్లకు వెకేషన్ కోసం ట్రావెల్ చేస్తూ ఉంటారు. వారి కోసం.. సౌత్ సెంట్రల్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

Special Trains: కాచిగూడ - కాకినాడ మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. మరికొన్ని కూడా పొడిగింపు.. ఇవిగో డీటేల్స్
Train

Updated on: May 13, 2023 | 8:26 AM

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కాచిగూడ – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైలు నెం-07417 కాచిగూడ నుంచి మే 13న రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మే 14 ఉదయం 8.40 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది. రైలు నెం-07418 కాకినాడ టౌన్‌లో మే 14న రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మే 15 ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ III టైర్‌లను, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయి.

వేసవి రద్దీ నేపథ్యంలో.. కొన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 07643 హైదరాబాద్‌ టూ తిరుపతి జూన్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం.. ట్రైన్ నంబర్ 07644  తిరుపతి టూ హైదరాబాద్‌  జూన్‌ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం.. ట్రైన్ నంబర్ 07481  తిరుపతి–సికింద్రాబాద్‌ జూన్‌ 4 నుంచి 25 వరకు ఆదివారం… రైలు నంబర్ 07482 సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి జూన్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం… రైలు నంబర్ 07631  హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌ జూన్‌ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం.. సర్వీసులు ఉంటాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..