Vijayawada: బెజవాడలో దారుణం.. హోటల్‌కు తీసుకెళ్లి భార్యను చంపిన భర్త

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గవర్నర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. గవర్నర్‌పేటలోని అశోక్‌ రెసిడెన్సీలో ఓ వ్యక్తి భార్య గొంతు కోసి దారుణంగా (husband murdered wife) హత్య చేశాడు.

Vijayawada: బెజవాడలో దారుణం.. హోటల్‌కు తీసుకెళ్లి భార్యను చంపిన భర్త
Wife Murder

Updated on: Mar 14, 2022 | 8:44 AM

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గవర్నర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. గవర్నర్‌పేటలోని అశోక్‌ రెసిడెన్సీలో ఓ వ్యక్తి భార్య గొంతు కోసి దారుణంగా (husband murdered wife) హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా.. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో కొన్నేళ్ల నుంచి విడివిడిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆదివారం విజయవాడ (Vijayawada) లోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు.

అనంతరం దంపతులిద్దరూ మాట్లాడుకుంటుండగా మళ్లీ వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను కిరాతకంగా గొంతు కోసం చంపాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Indian Students: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం..

Triple Murder Case: కువైట్ త్రిపుల్ మర్డర్ కేసు.. టీవీ9 కథనాలకు స్పందించిన ఇండియన్ ఎంబసీ అధికారులు..