
విశాఖ కొండలతో కలిసివున్న నగరం. ఒకవైపు సముద్రం, చుట్టూ ఎత్తైన కొండలు, ఇలా కొండ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి తరచూ అనేక కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఓ భారీ కొండ చిలువ స్థానికులను పరుగులు పెట్టించింది. సింధియా షిప్పియార్డ్ ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన స్కూల్ ప్రాంగణంలో చెట్లపై ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన అటుగా వెళ్తున్న స్థానికులు భయపడిపోయి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.
సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన నాగరాజు.. కొండచిలువను పట్టుకుందామంటే.. అది కనిపించకుండా పోయింది. ఎక్కడుందా అని చుట్టుపక్కల వెతుకుతుంటే.. పక్కనే ఉన్న చెట్టుపైకి పాకుతూ కనిపించింది. అది గమనించిన నాగరాజు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అదుపులోకి రాలేదు. మరింత శ్రమించి మెల్లగా దాన్ని పట్టుకుకుని చెట్టుకు అతుక్కుని ఉన్న ఆ కొండచిలువను మెల్లగా కిందకు దించాడు. దాన్ని చాకచర్యంగా రెస్క్యూ చేసి ఒక సంచిలో వేసుకొని జనావాసాలకు దూరంగా అడవుల్లో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా కొండచిలువలు, పాము సంచరించే ప్రాంతాలతో పాటు చెట్లపై కూడా వేట చేస్తాయి. చెట్లపై పక్షులు, జంతువులను వేటాడటానికి ఇష్టపడతాయి. కొన్ని సందర్భాల్లో పక్షుల గుడ్లు మింగేస్తాయి. అయితే కొండచిలువలు చెట్ల పైకి ఎక్కేందుకు తమ అసాధారణ కండరాల బలం, పొలుసులను ఉపయోగించి సులభంగా ఎక్కగలవు. ఇవి చెట్టుకు చుట్టుకుంటూ పైకి పాకుతాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.