Tirumala Info: తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం తరలి వచ్చారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 50వేలకు పైగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇంతమంది భక్తులు దర్శించుకోవడం కరోనా కాలంలో ఇదే తొలిసారి. జనవరి నెల వరకు కూడా కేవలం 30 వేల మంది భక్తులు మాత్రమే స్వామి వారిని దర్శించుకునేవారు. అయితే టీటీడీ చర్యలతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. స్వామి వారి సర్వదర్శనం టికెట్లు 20 వేల వరకు టీటీడీ ఇస్తోంది. దాంతో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. కాగా, టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం.. ఆదివారం ఒక్కోరోజు 50,200 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,621 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక ఆదివారం ఒక్కోరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also read:
Sreesanth Angry: కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ క్రికెటర్ శ్రీశాంత్.. కారణమిదే..!