మెగాస్టార్ 154వ మూవీ, వాలెంటైన్స్ డే నాడు వకీల్ సాబ్, విజయ్ దేవరకొండ రికార్డ్, ప్రభాస్ సలార్ విలన్.. టోటల్ టాలీవుడ్ అప్డేట్స్

తాను నటిస్తున్న 154వ మూవీ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తాను ఓ సినిమా చేస్తున్నట్టుగా చెప్పిన మెగాస్టార్ ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని

మెగాస్టార్ 154వ మూవీ, వాలెంటైన్స్ డే నాడు వకీల్ సాబ్, విజయ్ దేవరకొండ రికార్డ్, ప్రభాస్ సలార్ విలన్.. టోటల్ టాలీవుడ్ అప్డేట్స్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 08, 2021 | 5:12 AM

తాను నటిస్తున్న 154వ మూవీ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తాను ఓ సినిమా చేస్తున్నట్టుగా చెప్పిన మెగాస్టార్ ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని వెల్లడించారు.

వాలెంటైన్స్‌ డే కానుకగా వకీల్‌ సాబ్‌ టీం మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 14న పవన్‌ కల్యాణ్, శృతిహాసన్‌ కాంబినేషన్‌కు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌. ఇప్పటికే సాంగ్ కంపోజింగ్‌ పూర్తయ్యిందన్న దేవీ… ఆ సాంగ్ బన్నీ ఫ్యాన్స్‌ను అలరిస్తుందని హామీ ఇచ్చారు.

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్‌ లవర్ యూట్యూబ్‌లో రికార్డ్స్‌ సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ వర్షన్‌ 6 రోజుల్లో 57 మిలియన్లు వ్యూస్‌ సాధించింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించారు.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన క్రాక్ సినిమా ఓటీటీలోనూ భారీ వ్యూస్ సాధిస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ఆహా యాప్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 24 గంటల్లో 22 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌ సినిమాలో మధు గురుస్వామి విలన్‌గా నటించనున్నారు. తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించారు మధు. సలార్‌ లాంటి బిగ్ ప్రాజెక్ట్‌లో అవకాశం రావటంపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

బాలీవుడ్ నటి అలియా భట్‌… మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కూతురికి గిప్ట్‌ పంపించారు. ఇటీవల కిడ్స్ క్లోతింగ్‌ చైన్‌ ప్రారంభించిన ఆలియా, తన కంపెనీ డిజైనర్‌ వేర్‌ను దుల్కర్‌ కూతురి కోసం పంపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన దుల్కర్‌, అలియాకు థ్యాంక్స్ చెప్పారు.

సాండల్‌ వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారు. సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక, నెక్ట్స్ స్టార్ హీరో విజయ్‌ సరసన నటించనున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం రష్మిక పేరును పరిశీలిస్తున్నారు.

తన నటన గురించి హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా సినిమాలను నేను విమర్శించుకుంటాను… నటుడిగా నేను బెస్ట్ ఇవ్వలేదని ఫీలవుతుంటాను. కానీ కార్తీ, జ్యోతిక అలా కాదు… తమ పని విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉంటారు’ అని చెప్పారు.

ఉప్పల్ వైన్స్‌ సిబ్బంది అకృత్యం, కస్టమర్ పై విచక్షణా రహితంగా దాడి, రాత్రివేళ కుప్పకూలిపోయిన వికాస్ అనే యువకుడు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?