
వివరాల్లోకి వెళితే.. విశాఖ సాగర్ నగర్ ప్రాంతం.. అర్ధరాత్రి 12 దాటింది. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ తెరిచాడు. చీకట్లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. కాస్త లైట్ వేసి చూసేసరికి.. ఓ భారీ కొండచిలువ లోపల తిష్ట వేసి కూర్చుంది. దీంతో ఆ వాచ్ మెన్‌కు గుండె ఆగినంత పని అయింది. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించడంతో.. అర్ధరాత్రి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు కిరణ్.
కాలికి చుట్టేసి..!
స్నేక్ క్యాచర్ కిరణ్.. చాకచక్యంగా ఆ భారీ 12 అడుగుల కొండచిలువను బంధించేందుకు యత్నించాడు. రెస్క్యూ చేసి వాష్ రూమ్ నుంచి బయటకు తెస్తున్న క్రమంలో.. రెండు చేతులతో మెడను పట్టుకున్నాడు. దీంతో ఆ కొండచిలువ కిరణ్ కాలికి చుట్టేసింది. మెల్లగా అలాగే సెల్లార్‌లోకి వచ్చిన కిరణ్ కుమార్.. మరొకరి సహకారంతో కాలికి చుట్టిన కొండచిలువను విడిపించుకున్నాడు. కొండచిలువను రెస్క్యూ చేసి తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలో కొండ ప్రాంతం ఉండటంతో.. అక్కడ నుంచి ఆహారం కోసం కొండచిలువ వచ్చి ఉంటుంది ‘ అని టీవీ9 తో అన్నారు స్నేక్ క్యాచర్ కిరణ్. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమాచారం అందించాలని సూచించారు.
వీడియో దిగువ చూడండి…