Marriage Certificate: మూడు రోజుల్లోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

పెళ్లిళ్లు చేసుకునే చాలామంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకోరు. అవసరం లేదనుకుని అలాగే వదిలేస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిిఫికేట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి..? లాభాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం రండి.

Marriage Certificate: మూడు రోజుల్లోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?
Marraige Registration

Updated on: Dec 15, 2025 | 8:15 PM

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లి అనేది చాలామందికి జీవితంలో ఒక పెద్ద అనుభూతి. దీంతో బంధమిత్రులను పిలిచి అత్యంత గ్రాండ్‌గా జరుపుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో షాపింగ్ మాల్స్, గోల్డ్ షాపులు కళకళలాడుతున్నాయి. ఇక ఫంక్షన్ హోల్స్, కళ్యాణ్ మండపాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. జూన్ వరకు ముహూర్తాలు ఉండటంతో మ్యారేజ్ చేసుకోవాలనుకునేవారు పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నారు. పెళ్లి అంటేనే ఎవరికైనా పెద్ద పండుగ లాంటిది. అట్టహాసంగా జరపుకునేందుకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ చాలామంది తమ మ్యారేజ్‌ను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోరు. అవసరం ఉన్నప్పుడు చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటారు. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి..?

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అపప్లికేషన్ పూర్తి చేసి గ్రామ, వార్డు సచివాలయంలో ఇవ్వాలి. వాటితో పాటు మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, దంపతుల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డులు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌లు అందించాలి. ఇక ఇద్దరి సాక్షి సంతకాలు ఉండాలి. వీటిని సచివాలయంలో అందిస్తే గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయం, పట్టణాల్లో అయితే పురపాలక సంఘం కార్యాలయానికి పంపుతారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి మూడు లేదా నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. మీరు రూ.500 రుసుం చెల్లించి తీసుకోవాల్సి ఉంటుది. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకేనే సౌకర్యం అందుబాటులో ఉంది.

ఉపయోగాలు ఇవే..

భార్యాభర్తల మధ్య గొడవ జరిగి కోర్టు కేసుల వరకు వెళ్లినప్పుడు కోర్టులో సాక్ష్యం కోసం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇక భర్త లేదా భర్తను నామినీగా పొందుపర్చడానికి యూజ్ అవుతుంది. విదేశాలకు వెళ్లే సమయంలో వీసా, వర్క్ పర్మిట్, బీమా వంటివి పొందాలంటే ఉపయోగపడుతుంది.