AP: ఏపీ ప్రభుత్వానికి ఏ బ్యాంకులో ఎన్ని అప్పులు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి

|

Dec 08, 2021 | 6:30 AM

AP Government Bank Loan: ఏపీ ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్ల అప్పు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లించారు. రాజ్యసభలో

AP: ఏపీ ప్రభుత్వానికి ఏ బ్యాంకులో ఎన్ని అప్పులు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి
Ap Loans
Follow us on

AP Government Bank Loan: ఏపీ ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్ల అప్పు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేవ్‌లో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంఎనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. అయితే 2019 నుంచి 2021 వరకు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు వివరించారు.

ఏ బ్యాంకులో ఎంత రుణం..
స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్ల రుణం, బ్యాంక్‌ ఆఫ్‌ భరోడా నుంచి 5 కంపెనీలు, కార్పొరేషన్లు రూ.10,865 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7 వేల కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్ల రుణం అందించాయి. ఇక కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు నుంచి రూ.750 కోట్లు రుణం మంజూరు చేశాయి.

ఇంకా.. ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.5,500 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు రుణం పొందినట్లు మంత్రి వివరించారు.

Also Read:

UP Assembly Election 2022: యూపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు..!

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని 50 శాతం తగ్గిస్తున్నాం.. సీఈఓ అదర్‌ పూనావాలా