మానవత్వం మంటగలిసిపోతోందనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. డెడ్‌బాడీని ఇంట్లోకి కాదు కదా..కనీసం ఇంటి ముందుంచడానికి కూడా అనుమతివ్వలేదు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి( srikalahasti)లోని బీపీ అగ్రహారం(B P Agraharam)లో అనారోగ్యంతో మృతి చెందాడు మాబాషా అనే వ్యక్తి. దీంతో అతని డెడ్‌బాడీని ఇంట్లోకి తీసుకురావడానికి అభ్యంతరం వ్యక్తం చేశాడు ఇంటి యజమాని. కనీసం ఇంటిముందు కూడా ఉంచేందుకు వీల్లేదని హుకుం జారీ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆటోలోనే ఉంచారు కుటుంబసభ్యులు. ఆపై స్థానిక ఆటోడ్రైవర్లు ఆ కుటుంబ సభ్యులకు కష్ట సమయంలో తోడుగా నిలిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి(Biyyapu Madhusudhan Reddy).. అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి చనిపోయిన బాధలో ఉన్నవారితో ఈ తరహా ప్రవర్తన కరెక్ట్ కాదన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ముందు ముందు ఇలాంటి సమస్య తలెత్తకుండా ఇల్లు లేని పేదల డెడ్‌బాడీస్ ఉంచుకునేందుకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: AP: ఏపీలో కరెంట్ కోతల కల్లోలం.. ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. నరకం చూస్తున్న రోగులు