ఒకవైపు పెద్దిరెడ్డి.. ఇంకోవైపు బాలకృష్ణ.. పోటాపోటీ సమావేశాలతో వేడెక్కతున్న హిందూపూర్‌ రాజకీయాలు

సీఎం జగన్‌ ఆదేశాలతో మిషన్‌ హిందూపూర్‌ బాధ్యతలను మంత్రి పెద్దారెడ్డి భుజానికెత్తుకున్నారు. వ్యూహాత్మకంగా దీపికరెడ్డిని తెరపైకి తీసుకొచ్చారాయన. ఆమెతో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. పరిచయం చేస్తున్నారు. మరోవైపు హిందూపురంలో టీడీపీ సందడి కూడా పెరిగింది. పంచాయతీల వారీగా టీడీపీ శ్రేణులతో భేటీ అవుతున్నారు ఎమ్మెల్యే బాలక్రిష్ణ. బాలయ్యకు పోటీగా దీపికారెడ్డిని తెరపైకి తేవడం చర్చగా మారింది. బాలయ్యకు చెక్‌ ..

ఒకవైపు పెద్దిరెడ్డి.. ఇంకోవైపు బాలకృష్ణ.. పోటాపోటీ సమావేశాలతో వేడెక్కతున్న హిందూపూర్‌ రాజకీయాలు
Ap Politics

Updated on: Jan 09, 2024 | 12:24 PM

ఒకవైపు పెద్దిరెడ్డి.. ఇంకోవైపు బాలకృష్ణ.. ఇద్దరూ కూడా హిందూపురంపై ఫోకస్‌ పెట్టారు. వై నాట్‌ హిందూపురం టార్గెట్‌తో పెద్దిరెడ్డి ఆపరేషన్‌ మొదలుపెడితే… మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హిందూపురం అనంతపురం జిల్లాలో పొలిటికల్‌ హాట్‌స్పాట్‌. నాడు అన్నయ్య నుంచి నేడు బాలయ్య దాక.. ఒకే జెండా.. ఒకే అజెండా ఇన్నాళ్లు ఓ లెక్క.. మరి ఇక నుంచి నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా వున్న హిందూపురంలో బాలయ్యకు పోటీగా తెరపైకి దీపికా రెడ్డిని తీసుకొచ్చింది వైసీపీ. తీసుకురావడమే కాదు బోణీ కొడుతామంటూ మిషన్‌ హిందూపూర్‌ రీసౌండ్‌ ఇచ్చిందిలా..

సీఎం జగన్‌ ఆదేశాలతో మిషన్‌ హిందూపూర్‌ బాధ్యతలను మంత్రి పెద్దారెడ్డి భుజానికెత్తుకున్నారు. వ్యూహాత్మకంగా దీపికరెడ్డిని తెరపైకి తీసుకొచ్చారాయన. ఆమెతో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. పరిచయం చేస్తున్నారు. మరోవైపు హిందూపురంలో టీడీపీ సందడి కూడా పెరిగింది. పంచాయతీల వారీగా టీడీపీ శ్రేణులతో భేటీ అవుతున్నారు ఎమ్మెల్యే బాలక్రిష్ణ. బాలయ్యకు పోటీగా దీపికారెడ్డిని తెరపైకి తేవడం చర్చగా మారింది. బాలయ్యకు చెక్‌ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా మహిళా ప్లస్‌ బీసీ కార్డ్‌ను ప్రయోగిస్తుందా?

ఇటు ఇలా ధీమా వ్యక్తమవుతోంది. అటు హ్యాట్రిక్‌ పక్కా.. డౌటేలేదు అనే రేంజ్‌లో బాలయ్య హిందూపురంపై ఫోకస్‌ పెట్టారు. పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు. మరో నాలుగు రోజులపాటు హిందూపురంలోనే మకాం వేయనున్నారు బాలయ్య. ఇక దీపికారెడ్డిని ప్రజలకు పరిచయం చేస్తూ.. వైసీపీ సర్కార్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ.. విపక్షాల వైఖరిని ఎండకడుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి. అలా పెద్దిరెడ్డి, బాలకృష్ణ పోటాపోటీ సమావేశాలతో హిందూపూర్‌లో రాజకీయం వేడెక్కుతోంది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి