Andhra Pradesh: అమరావతిలో మళ్లీ ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ముదురుతున్న ఫ్లెక్సీ వార్..

Amaravathi: పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అమరావతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. అయితే బాబు టూర్‌ను నిరసిస్తూ..

Andhra Pradesh: అమరావతిలో మళ్లీ ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ముదురుతున్న ఫ్లెక్సీ వార్..
Chandrababu Naidu

Edited By:

Updated on: Apr 25, 2023 | 3:50 PM

Amaravathi: పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అమరావతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. అయితే బాబు చేపట్టిన ‘ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి’ టూర్‌ను నిరసిస్తూ వైసీపీ కూడా పోటీగా ఫ్లెక్సీలు పెట్టడంతో నిన్నటి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ డిమాండ్‌ చేయడంతో అధికారపార్టీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. దీంతో పోలీసులు రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలన్నారు.

అయితే సమస్య శ్రుతి మించడంతో.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ కార్యకర్తలతో కలిసి రోడ్లపైకి వచ్చారు. టీడీపీ ఫ్లెక్సీలు మళ్లీ ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ టెన్షన్‌ నెలకొంది. ఫ్లెక్సీలు తీసేయాలని పోలీసులు ఆదేశించారు. ప్రధాన సెంటర్లలో పోలీసులు పెద్ద సంఖ్యలోనూ మోహరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం. ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి