విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మావోయిస్టుల సంచారంతో ఉలిక్కిపడింది. ఆదివారం నాడు లండోలు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. అయితే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఉన్న రక్తపు మడుగుల గుర్తులను పసోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ ప్రాంతంలోనే పేలుడు పదార్థాలతో పాటుగా మావోయిస్టులు ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో పలువురు మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గత రెండు రోజులుగా విస్తృతంగా కూంబింగ్ జరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.