మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు.. విజయవాడ విడిచి వెళ్లొద్దని షరతు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు..  విజయవాడ విడిచి వెళ్లొద్దని షరతు
Ap High Court Rejects Dhulipalla Narendra’s Quash Petition

Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 11:46 AM

High Court Bail to Ex MLA Dhulipalla Narendra: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది.

సంగం డెయిరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగియంటూ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై గత నెల 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈరోజు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని.. నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉండగానే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఆదేశాలు జైలుకు అందిన తర్వాత ధూళిపాళ్ల విడుదల కానున్నారు.