heavy rainfall: ఆంధ్ర,తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మరో రెండు రోజుల పాటు జోరు వానలు

|

Jun 10, 2021 | 10:45 PM

తెలంగాణ,ఏపీ మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడ్డాయి. ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు...

heavy rainfall: ఆంధ్ర,తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మరో రెండు రోజుల పాటు జోరు వానలు
Monsoons
Follow us on

తెలంగాణ,ఏపీ మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడ్డాయి. ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో తుని వరకు, తెలంగాణలో భద్రాచలం, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఉత్తర బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయని వెల్లడించింది. ఇదే సమయంలో తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం ఉత్తర కోస్తా, ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనావ వేసింది.

రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావాలతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా  పగటి  ఉష్ణోగ్రతలు 33-39 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సీమ, దక్షిణ కోస్తాలో కొద్దిగా ఎండ, వేడి గాలులు ఉండగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలపడి చురుగ్గా మారనున్నాయి.

ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి : Surya Grahan 2021: రింగ్ ఆఫ్ ఫైర్ అద్భుతం.. వివిధ దేశాల్లోని కనిపించిన సూర్యగ్రహణం ఇలా..

క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. అర్ధరాత్రి దాటితే జనం వణుకు.. అనుమానాస్పద స్థితిలో యువకుడు అదృశ్యం.!