
Heavy Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు గంటల్లో ఆయా జిల్లాల్లోని గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకులూరిపేట పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది.
అలాగే తీరం వెంబడి గంటకు భారీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి