High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ.. ఆగస్టు 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ..

|

Jul 23, 2021 | 1:53 PM

AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌..

High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ.. ఆగస్టు 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ..
Visakha Steel Plant
Follow us on

AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో ఇవాళ విచారణ జరుగగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల సమయం కోరింది. అయితే, కౌంటర్ దాఖలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ నెల 29వ తేదీన బిడ్డింగ్‌కు కేంద్రం ముందుకు వచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన కేంద్రం తరఫు న్యాయవాది.. అలాంటిదేమీ లేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆగస్టు 2వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.

వ్యూహాత్మ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. త్వరలోని దీనికి సంబంధించి బిడ్డంగ్ వేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అయితే, విశాఖ స్టీల్ ప్రాంట్ ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా.. విపక్షాలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగదని పార్లమెంట్‌ సాక్షిగా ఇటీవల ప్రకటించింది కూడా.

Also read:

Weather Forecast: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Bone Health: ఎముకలు బలహీన పడితే వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గుతుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Warangal News: పురిటి నొప్పులతో మహిళ అవస్థలు.. అది గమనించిన యువకులు ఏం చేశారంటే..