Chandrababu Naidu: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు

Andhra Pradesh: ఇన్నర్‌ రింగ్‌ కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ కూడా హైకోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణను హైకోర్టును ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో బాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని సీఐడీ తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 470 పేజీలతో అదనపు అఫిడవిట్‌ను ఏపీ సీఐడీ హైకోర్టుకు సమర్పించింది.

Chandrababu Naidu: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు

Updated on: Nov 24, 2023 | 9:36 PM

Chandrababu Naidu: ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. అలాగే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇసుక కుంభకోణంలో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది.

ఇన్నర్‌ రింగ్‌ కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ కూడా హైకోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణను హైకోర్టును ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో బాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని సీఐడీ తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 470 పేజీలతో అదనపు అఫిడవిట్‌ను ఏపీ సీఐడీ హైకోర్టుకు సమర్పించింది.

మరో వైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ న్యాయవాదులు ప్రస్తావించారు. తమ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ కేసు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రావచ్చని ఏపీ సీఐడీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

కీలక పాయింట్స్..

  1. ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  2. ఈ నెల 30న విచారణ చేపట్టనున్న హైకోర్టు
  3. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు బెయిల్‌ కేసు ఈ నెల 29కి వాయిదా
  4. తదుపరి ఉత్తర్వుల వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు
  5. స్కిల్‌ స్కామ్‌ పిటిషన్‌ను సీజేఐ దృష్టికి తెచ్చిన ఏపీ సీఐడీ న్యాయవాదులు
  6. వచ్చే మంగళవారం పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..