AP Schools: ఏపీలో ఒంటి పూట బడులు వచ్చేస్తున్నాయ్.. ఈ సూచనలు మీ కోసమే

|

Mar 30, 2023 | 2:55 PM

కానీ ఈ అకడమిక్ ఇయర్‌లో స్కూల్స్ పని దినాలు తక్కువగా ఉండటంతో.. ఒక్కపూట బడులు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP Schools: ఏపీలో ఒంటి పూట బడులు వచ్చేస్తున్నాయ్.. ఈ సూచనలు మీ కోసమే
Andhra Half Day Schools
Follow us on

ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. ఆల్మోస్ట్ ఏప్రిల్ వచ్చేసింది. స్కూళ్లు ఇంకా ఫుల్ టైమ్ నడుస్తున్నాయి. అటు తెలంగాణలో ఒంటి పూట బడులు పెట్టి ఇప్పటికే 15 రోజులు అవుతుంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలు ఎండలు, ఉక్కపోతకు అల్లాడతారేమో అని  తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఉన్న సమాచారాన్ని బట్టి ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్స్ మొదలవ్వనున్నాయి.

2021-22 అకడమిక్ ఇయర్‌లో కోవిడ్ నేపథ్యంలో ఆగస్టు మూడో వారం నుంచి స్కూల్స్ పున: ప్రారంభమయ్యాయి. దీంతో వర్కిండ్ డేస్ తగ్గాయి. ఆ లోటు భర్తీ చేసేందుకు కొన్ని సెలవు దినాల్లోనూ స్కూల్స్ రన్ అయ్యేలా 180 రోజులకు విద్యాశాఖ క్యాలెండర్‌ను సర్దుబాటు చేసింది. అందుకే ఏప్రిల్ మొదటివారం వరకు ఆగాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వరకు ఒంటిపూట బడులు కొనసాగించి.. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఎండ తీవ్రతను బట్టి ఒక్క పూట బడుల సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు స్కూల్స్ రన్ చేసే అవకాశం ఉంది.

ఎండాకాలం కాబట్టి పిల్లల విషయంలో ఇటు తల్లిదండ్రులు, అటు స్కూల్స్ ప్రత్యే శ్రద్ద తీసుకోవాలి

  • బస్సు లేదా వాహన సౌకర్యం లేకపోతే.. పేరెంట్స్ పిల్లలను స్కూళ్ల వద్ద దిగబెట్టడం, తీసుకురావడం వంటివి చేయాలి. లేదంటే వాళ్లు ఎండకు అల్లాడిపోతారు.
  • పాఠశాలల క్లాస్ రూముల్లో ఫ్యాన్స్ ఉండేలా యాజమాన్యం చూసుకోవాలి
  • స్వచ్చమైన తాగునీరు పిల్లలకు అందుబాటులో ఉంచాలి
  • క్లాసు రూముల్లో సీలింగ్ కాకుండా రేకులు ఉంటే.. ఎండ వేడిమి పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
  • బడి నుంచి వచ్చాక పిల్లలు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..