Andhra News: కుటుంబాన్ని చిదిమేసిన మానసిక వేదన.. కూతురితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య!

గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కూతురి మానసిక, శారీరక స్థితి సరిగ్గా లేదని, ఎన్ని హాస్పిటల్స్‌ తిరిగినా నయం అవ్వట్లేదని తీవ్ర మానసిక వేదనకు గురైన తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మత్తు ఇంజక్షన్‌లు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

Andhra News: కుటుంబాన్ని చిదిమేసిన మానసిక వేదన.. కూతురితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య!
Andhra News

Updated on: Mar 30, 2026 | 3:27 PM

కూమార్తె మానసిక, శారీరక స్థితి సరిగ్గా లేక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ కుటుంబ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సాతులూరుకు చెందిన కుంభా గోపి, శంకర కుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గోపి భోపాల్ ఎయిమ్స్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. అయితే ఆ చిన్నారి ప్రస్తుతం మానస్థితి బాగోలేదు, అలాగే శారీరక ఎదుగుదల కూడా సరిగ్గా లేదు. దీంతో చిన్నారికి బాగు చేయించేందుకు తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అనుకున్న ప్రకారం భోపాల్ ఎయిమ్స్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు గోపి. అక్కడి నుంచి ఫ్యామిలీని తీసుకొని నేరుగా ఓ లాడ్జ్‌కు వెళ్లారు. అక్కడ మత్తు ఇంజెక్షన్ ఎక్కించుకొని ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భార్య శంకరకుమారి, కూతురు మౌనిహ అక్కడికక్కడే మృతి చెందగా భర్త గోపి ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి మృతికి గల కారణాలపై ఆయన తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కుటుంబం మొత్తం చనిపోవాలని ముందే నిర్ణయంచుకున్నట్టు వారి ఫోన్ మెసేజ్‌ల ద్వారా పోలీసులు గుర్తించారు. పాప నేను కలిసి చనిపోతాం కనీసం నువ్వయినా హ్యాపీగా ఉండు అని గోపి నుంచి శంకరకుమారికి కొన్నాళ్ల క్రితం వాట్సాప్ మెసేజ్ చేశాడు. చావైనా, బ్రతుకైనా నీతోనే అంటూ ఆమె భర్తకు రిప్లై ఇచ్చినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం ముగ్గురు కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో నాదెండ్ల మండలం సాతులూరు విషాదచాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us