AP News: మాటలతో మాయ చేయడం ఔట్ డేటెడ్.. మోడ్రన్ డ్రెస్‌లతో అట్రాక్ట్ చేయడం నయా ట్రెండ్. అవును.. గుంటూరులో ఇదే ఫార్మూలాతో వాహనదారుల్ని బోల్తా కొట్టిస్తోంది కిలేడీల గ్యాంగ్. ఊరు చివర అడ్డా వేసి అందినకాడికి దోచుకుంటున్న అమ్మాయిల నయా చీటింగ్‌కు పోలీసులు బ్రేకులు వేశారు. మోడ్రన్ డ్రెస్‌లతో వాహనదారుల జేబులకి చిల్లులు పెడుతున్న యువతులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెదకాకాని పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కొంతమంది నార్త్ అమ్మాయిలు అడ్డా వేశారు. వాహనదారులను ఆపి వారిని మాటల్లోకి దింపి.. పిల్లల కోసం డొనేషన్ పేరుతో నీట్‌గా నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించడంతో కిలేడీల కథ పీఎస్‌కు చేరింది. వాహనదారుల ఫిర్యాదుతో పక్కా నిఘా పెట్టిన పోలీసులు చీట్ చేస్తున్న కిలేడీస్‌ను అరెస్ట్ చేశారు. అమ్మాయిల అక్రమ వసూళ్ల దందాపై ఆరాతీస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారో కూపీ లాగుతున్నారు. కాగా గతంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా గ్యాంగ్స్ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది.