Gudivada SI Suicide: కృష్ణాజిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలపై గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. రెండు నెలల క్రితం విజయ్ కుమార్‌కు వివాహమైంది. భార్యను కాపురానికి తీసుకురాకుండా, గుడివాడలో బ్యూటీషియన్‌తో కలిసి నివాసముంటున్నారు విజయ్ కుమార్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read : World’s dirtiest man: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి.. 65 ఏళ్లగా స్నానమే చేయలేదట