Group Clashes in Velagapudi: గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లా వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Group Clashes in Velagapudi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లా వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రిస్మస్ స్టార్ పెట్టుకునే విషయంలో రెండు రోజుల నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ వివాదం కాస్తా నేడు మరింత పెద్దదైంది. దాంతో అక్కడి ప్రజలు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా, ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో ఖాకీలు తమ లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గుంపులు గుంపులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also read:
నగిషీలు అద్దుకుంటున్న అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి నూతన రథం..రంగులు మినహా అన్ని పనుల్ని పూర్తి
