Vizag: మొక్కల మధ్య నుంచి ఏవో అలజడి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..

విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్ హిల్స్ నేవీ క్వార్టర్స్‌లో ఓ కుటుంబానికి ఇంటి బయట మొక్కల మధ్య గ్రీన్ పిట్ వైపర్ కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని రెస్క్యూ చేశారు.

Vizag: మొక్కల మధ్య నుంచి ఏవో అలజడి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..
Green Pit Viper

Edited By:

Updated on: Oct 30, 2026 | 12:35 PM

విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్ హిల్స్ నేవీ క్వార్టర్స్‌లో ఓ కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. వారు నివసిస్తున్న క్వార్టర్ బయట తీగజాతి మొక్కలు ఉన్నాయి. వాటి దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఆకులు, కొమ్మల మధ్య పసుపు పచ్చని రంగులో ఉన్న ఓ పాము కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయన మొక్కల మధ్య మాటువేసిన పామును జాగ్రత్తగా పట్టుకుని రెస్క్యూ చేశారు. దాన్ని గ్రీన్ పిట్ వైపర్‌గా గుర్తించారు.

గ్రీన్ పిట్ వైపర్లు సాధారణంగా చెట్లు, పొదలు, దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండటంతో ఆకుల మధ్య సులభంగా కలిసిపోతాయి. ఇవి విషపూరితమైన పాములు. కాటు వేస్తే తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఈ పాము కరిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. చఅయితే గ్రీన్ పిట్ వైపర్‌ను విషం లేని గ్రీన్ వైన్ స్నేక్‌తో చాలామంది పొరబడుతుంటారు. గ్రీన్ వైన్ స్నేక్ చాలా సన్నగా, పొడవుగా ఉండటంతో పాటు సూదిలాంటి పదునైన ముక్కును కలిగి ఉంటుంది. గ్రీన్ పిట్ వైపర్ మాత్రం త్రిభుజాకారపు తలతో, దృఢమైన శరీరంతో కనిపిస్తుంది.

ఇళ్ల పరిసరాల్లో మొక్కలు, పొదల దగ్గర ఇలాంటి పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు. వెంటనే నిపుణులైన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us