Andhra Pradesh: పచ్చి మిర్చి రైతు పంట పండింది.. మార్కెట్‌లో మంచి ధర పలకడంతో రాయలసీమ రైతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే సమయంలో పంటలను విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు తెల్ల బంగారం పత్తి ధర రికార్డ్ స్థాయిలో పలుకుతుండగా, ఇటు పచ్చి మిర్చికి కూడా మంచి డిమాండ్ ఉండటంతో రైతుల కళ్లు కూడా ఆనందంతో మెరిసిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో పచ్చి మిర్చిని అధికంగా పండిస్తున్నారు రైతులు. అయితే ఇప్పటి వరకు తాము ఆశించినంత ధర లేకపోవడంతో కొంత దిగాలుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చి మిర్చికి మంచి ధర పలకడంతో చెరుకు తిన్నంత ఖుషీగా ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లా(kurnool district) ఆస్పరి(Aspari) కూరగాయల మార్కెట్ లో పచ్చిమిర్చి ధర కిలో 100 రూపాయలు పలుకుతోంది. 20 కిలోలు ఉన్న బస్తా ను 2000 వేల రూపాయల కు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. ఇటు ధర ఎక్కువగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆస్పరి కూరగాయల మార్కెట్ కు పెద్ద ఎత్తున పచ్చిమిర్చి దిగుబడులను తీసుకొస్తున్నారు రైతులు .
దీంతో ఆస్పరిలోని కూరగాయల మార్కెట్ పచ్చి మిర్చితో నిండిపోతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల వాహనాల ద్వారా మార్కెట్‌కు పచ్చి మిర్చిని తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ రైతుల నుంచి పచ్చి మర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, ఇంత కంటే ఎక్కువ ధరకు విక్రయించేందుకు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కర్నూలు జిల్లాతో పోల్చితే హైదరాబాద్‌లో ధరలు అధికంగా ఉండటంతో అస్పరి మార్కెట్ నుంచి హైదరాబాద్‌కు వాహనాల్లో తరలిస్తున్నారు.
Also Read: Telangana: సామాన్యుడికి మరో షాక్.. విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే..?