AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఊహించని నిర్ణయం.. ఇకపై ఆ సైజుల్లో కూడా..

ఏపీలోని మందుబాబులు ఎగిరి గంతేసే వార్త. రాష్ట్రంలో మరికొన్ని సైజుల్లో కూడా మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిమాణాలకు అదనంగా మరికొన్ని సైజుల్లో కూడా రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అనుమతి జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ఏపీలోని మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఊహించని నిర్ణయం.. ఇకపై ఆ సైజుల్లో కూడా..
Liquor
Venkatrao Lella
|

Updated on: Jun 05, 2026 | 8:08 PM

Share

ఏపీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. కొత్త సైజుల్లో మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 90,180,375,750,1000 ఎంఎల్ పరిమాణాల్లో లిక్కర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. కానీ త్వరలో 150, 200 ఎంఎల్ సైజుల్లో కూడా బాటిల్స్ రానున్నాయి. దీంతో మందుబాబులకు మరిన్ని సైజుల్లో మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 150, 200 ఎంఎల్ సైజుల్లో కూడా లిక్కర్ బాటిళ్లను తీసుకొస్తామని మద్యం తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది.

ఒక కేసులో ఎన్నో ఉన్నాయంటే..?

ఏపీ ఎక్సై్జ్ శాఖ మద్యం తయారీ కంపెనీలకు అనుమతి మంజూరు చేసింది. దీంతో త్వరలో ఏపీలో 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం బాటిళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న సైజుల్లోనే కాకుండా అదనంగా మరిరొన్ని పరిమాణాల్లో ఉన్న వాటిని కూడా మందుబాబులు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి గతంలో ఉన్న నిబంధనల్లో ఎక్సైజ్ శాఖ మార్పులు చేసింది. ఈ మేరకు మద్యం కేసుల్లో ఏ సైజు కలిగిన సీసాలు ఎన్ని ఉండాలనే నిబంధనలను కూడా రూపొందించింది. ఒక కేసులో 200 ఎంఎల్‌ సైజు బాటిళ్లు 45 ఉండగా.. 150 ఎంఎల్ బాటిళ్లు 60 ఉండాలని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఒక కేసులో 180 ఎంఎల్ బాటిళ్లు 48 ఉంటుండగా.. 375 ఎంఎల్ సీసాలు 602 ఉంటున్నాయి. ఇక 180 ఎంఎల్ బాటిళ్లు 48 ఉండగా.. ఇక 375 ఎంఎల్ హాఫ్ బాటిళ్లు 24 ఉంటున్నాయి. ఇక 750 ఎంఎల్ ఫుల్ బాటిళ్లు ఒక కేసులో 12 ఉంటున్నాయి. అయితే కొత్తగా వచ్చే 150 ఎంఎల్, 200 ఎంఎల్ బాటిళ్ల ధరలు ప్రస్తుతం ఉన్న ధరల ప్రతిపాదికన ఉంటాయని ఎక్సై్జ్ శాఖ స్పష్టం చేసింది. ఆయా బ్రాండ్‌లకు ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఉంటాయి. అయితే మద్యం ధరలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతాయి. వాటిల్లో ఎలాంటి మార్పులు లేవని ఎక్సై్జ్ శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణలో పెరగనున్న  మద్యం  ధరలు

అటు ఏపీలో మద్యం సరఫరాలో ఈ మార్పులు చోటుచేసుకోగా.. తెలంగాణలో మాత్రం మందుబాబులకు త్వరలో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం ధరలను త్వరలో పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. మద్యం తయారీ కంపెనీలు ధరలను పెంచాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా ధరలను పెంచాలని సూచించింది. లిక్కర్ తయారీదారులు 10 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం అంత మొత్తంలో పెంచేందుకు సిద్దంగా లేదని తెలుస్తోంది.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ